Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో మొత్తం 9062 సీట్లు ఉండగా మొదటి విడుతలోనే 8,909 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 153 సీట్లను ఈ విడుత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయున్నారు. గురువారం విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 22న సీట్లు కేటాయించనున్నారు.