Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి మళ్లీ భూకంపం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ, కాంగ్రా పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.బుధవారం రాత్రి 9:32 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీకి ఉత్తర వాయువ్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత 15 రోజులుగా హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలు సంభవించాయి.ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న హిమాలయ ప్రాంతంలో నవంబర్ 8, 16తేదీల మధ్య కనీసం 10 భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ డేటా వెల్లడించింది.భూకంపాల పీడిత ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలతో హిమాచల్ ప్రదేశ్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.