Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూలు: శ్రీశైలం భ్రమరాంబికామల్లికార్జున స్వామివారి ఆలయ ఆర్జిత సేవల్లో అదికారులు మార్పులు చేశారు. ఈ నెల 23 వరకూ గర్భాలయ సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 9 గంటల తరువాతే స్పర్శ దర్శనం నిర్వహించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో స్వర్శ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేయనున్నారు.