Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1571 కోట్లతో నిమ్స్ ఆస్పత్రిని మరింత విస్తరించడానికి పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాజెక్టు పనులను కూడా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. టెండర్లను ఆహ్వానించి వీలైనంత తొందరగా పనులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతమున్న 1800 పడకల ఆస్పత్రిలో మరో రెండు వేల పడకలు అదనంగా చేరనున్నాయి. కొత్తగా వచ్చే రెండు వేల ఆక్సిజన్ పడకలలో 500 వరకు ఐసీయూ బెడ్స్ రానుండగా, 42 విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడానికి టీఎ్‌సఎ్‌సహెచ్‌సీఎల్‌కు నోడల్ ఏజెన్సీగా ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించింది. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు నిమ్స్ డైరెక్టర్‌కు అనుమతి ఇచ్చింది. నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.