Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం, కరైకల్, రామనాథపురం జిల్లాలకు చెందిన జాలర్లు ఈ నెల 15న చేపల వేటకు హిందూమహా సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీలంకకు చెందిన కొడియాక్కారై వద్ద వారిని లంక నౌక దళం అదుపులోకి తీసుకున్నది. విచారణ నిమిత్తం వారందరిని కంకేసంతురై పోర్టుకు తరలించారు. కాగా, 14 మంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేడంతో వారి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరికి వీలైనంత తొందరగా విడిపించాలని తమిళనాడు, భారత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తరచూ తమ జాలర్లను శ్రీలంక అరెస్టు చేస్తున్నదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.