Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూపీ: ఉత్తరప్రదేశ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హర్దోయి ప్రాంతంలో ఓ మార్కెట్ సముదాయంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఓ చీరల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో షాపు మొత్తం కాలి బూడిదయింది. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ప్రక్కన ఉన్న రెండు షాపులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.