Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫేస్‌బుక్‌కు చెందిన మెటా ఫ్లాట్‌ఫామ్ సంధ్యా దేవనాథన్‌ను ఇండియా హెడ్‌గా నియమించింది. మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే మెటా నుంచి అజిత్ మోహన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి కంపెనీ స్నాప్‌లో అతను చేరాడు. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఫ్లాట్‌ఫామ్ పబ్లిక్ పాలసీ డైరక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా ఇటీవల రిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌పై ప్రస్తుతం ఇండియాలో రెగ్యులేటరీ సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో సంధ్యా దేవనాథన్ నియామకం కీలకంకానున్నది. ఫేక్ న్యూస్, విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలమైంది. 2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. జనవరిలో ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.