Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై సిట్ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వాదనలను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, ఆర్థిక, ఇతర అంశాలపై వైకాపా ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 21న సిట్ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సిట్ ఏర్పాటుపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది.