Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇవాళ పాల్గొన్నారు. అక్కడ గడ్కరీ అస్వస్థతకు లోనైట్లు తెలుస్తోంది. ఇవాళ మూడు జాతీయ హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 1206 కోట్లతో ఆ ప్రాజెక్టులను చేపడుతున్నారు. గడ్కరీ ఆరోగ్యం గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.