Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా రాష్ట్రాల పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. ఇది సరైంది కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ డీ రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను లూటి చేస్తు కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2014 ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని మోదీ నెరవేర్చలేకపోయారని నిప్పులు చెరిగారు. మోదీ విధానాల వలన రూపాయి విలువ పతనమైందన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు చేయడంతో రాష్ట్రాలకు నిధులు రావడం లేదన్నారు. ప్రాంతీయ, జాతీయ పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. 2024లో మోదీని గద్దె దింపుతామన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాజా పేర్కొన్నారు.