Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ అనుచరుడు బుసారపు శ్రీనివాస్‌కు నోటీసులిచ్చారు. 41 సీఆర్‌పీసీ కింద సిట్ నోటీసులిచ్చింది. ఈనెల 21న సిట్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా కేరళలో రెండు బృందాలతో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొచ్చి, కొల్లంలో సిట్ తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చిన తుషార్ అనే వ్యక్తి కేరళ ఎన్డీఏ కన్వీనర్‌గా పని చేసినట్టు గుర్తించారు. భారత ధర్మ జనసేన పార్టీ నేతగా అధ్యక్షుడు తుషార్ ఉన్నారు. బీజేపీ మద్దతుతో వాయనాడు నుంచి రాహుల్ గాంధీపై ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశాడు. నవంబర్ 21వ తేదీన విచారణకు రావాలని తుషార్‌కు సిట్ ఆదేశాలు జారీ చేసింది. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌తో తుషార్ మాట్లాడినట్టు తెలుస్తోంది.