విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఎల్సిపిఓ సంజీవ అన్నారు. గురువారం మండలంలోని కర్లపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంజీవ హాజరై మాట్లాడారు. బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 మరియు బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 అక్రమ ట్రాఫికింగ్ చట్టంలపై అవగాహన పెంచుకోవాలన్నారు.జీవించే, అభివృద్ధి చెందే, భాగస్వామ్య, రక్షణ హక్కుల గురించి వివరించారు. , బాలల హక్కుల ఉల్లంఘనను గుర్తించాలని సూచించారు. హక్కులు, చట్టాల పట్ల తల్లిదండ్రులు, సమాజం చొరవ తీసుకోవాలని తద్వారానే బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల సిబ్బంది అదేవిధంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, గుడ్ టచ్, బ్యాక్ టచ్. గెలుపు చెందడానికి వారిలో మంచి అలవాట్లు నేర్చుకునే పద్ధతుల గురించి వివరించారు. బాలలు విద్యార్థి దశలో మంచి అలవాట్లు, మంచి గుణాలు అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్1098 కి కాల్ చేయగలరు అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గొంది దివాకర్, చైల్డ్ లైన్ కౌన్సిలర్ రజిని ఐసిడిఎస్ సూపర్వైజర్ కళావతి అంగన్వాడీ టీచర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.