నవతెలంగాణ: నవీపేట్: డిసెంబర్ 10వ తేదీన జరిగే స్వర్ణోత్సవ సభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ అన్నారు. మండలంలోని నాగేపూర్ గ్రామంలో గ్రామ సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి బీడీ కార్మికుల సంక్షేమానికి కృషి చేశామని గుర్తు చేశారు. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ తో జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజేశ్వర్ బీడీ కార్మికులు గంగామణి, నర్సు బాయ్, లక్ష్మీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.