Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తాడ్వాయి
మండలంలోని మేడారం ఆదివాసి మ్యూజియం లో క్యూరేటర్ కుర్సం రవి ఆధ్వర్యంలో సర్పంచ్ చిడం బాబురావు అధ్యక్షతన గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా గౌరవార్థం గురువారం జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడారం ఇంగ్లీష్ మీడియం, ఊరటం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమానాల ప్రధాన చేశారు. విద్యార్థుల ఆదివాసి నృత్యాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలకు వందనం చేశారు. ధర్తీ ఆబా అని కూడా పిలవబడే బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోడీ రాంచీలో ఒక మ్యూజియాన్ని అంకితం చేశారని అన్నారు. బిర్సా ముండా జయంతి నాడు జన జాతీయ గౌరవం దివాసును పాటించడం అద్భుతమైన గిరిజన సంస్కృతిని మరియు దేశాభివృద్ధికి దోహదపడటానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని వారన్నారు. ఊరటం పాఠశాల ఉపాధ్యాయులు సిద్ధబోయిన స్వామి మేడారం ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.