Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అకాల మరణాలపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని, అది హార్ట్ ఎటాక్ కాదని అన్నారు. కన్నడ ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హిందీ నటులు రాజు శ్రీవాత్సవ, సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ, సిద్ధార్థ్ శుక్లా, బ్రహ్మస్వరూప్ మిశ్రా తదితరులు వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురై, ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
దీని గురించి సునీల్ మాట్లాడుతూ.. ''శరీరం సహకరించేంత వరకే వారు వ్యాయామాలు చేశారు తప్ప పరిధిదాటి చేసుండరు. వారు తీసుకున్న సప్లిమెంట్స్, స్లెరాయిడ్స్‌లో సమస్య ఉండొచ్చు తప్ప ఎక్కువగా వర్కౌట్ చేయడమనేది కారణం కాదు. సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ అధికంగా తీసుకునే వారి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అది హార్ట్ ఎటాక్ కాదు. వ్యాయామాలు చేసేవారు పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం కీలకం. ఇవి ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి'' అని సునీల్ శెట్టి వివరించారు. తాను నటించిన 'ధారవి బ్యాంక్' వెబ్ సిరీస్ ఈ నెల 19న ఓటీటీ 'ఎమ్‌ఎక్స్ ప్లేయర్'లో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న సునీల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.