దైవం మనుష్య రూపేణా #MBforSavingHearts ❤️@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/n63HnYUBJG
— BA Raju's Team (@baraju_SuperHit) November 18, 2022
Authorization
దైవం మనుష్య రూపేణా #MBforSavingHearts ❤️@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/n63HnYUBJG
— BA Raju's Team (@baraju_SuperHit) November 18, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ కొన్నిరోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. అయితె కృష్ణ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నా కూడా ఆ బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మోక్షిత్ అనే చిన్నారి గుండె జబ్బుతో బాధపడుతున్నాడని తెలుసుకున్న మహేశ్ బాబు ఆ చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించారు. చిన్నారి ప్రాణం కోసం మహేశ్ బాబు తపించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే, మరోవైపు ఆ చిన్నారి శస్త్రచికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసినా, చిన్నారి మోక్షిత్ కోసం మహేశ్ బాబు స్పందించిన తీరు అభిమానులను కదిలించివేసింది. ఈ తరుణంలో విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో మోక్షిత్ కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్టు సమాచారం అందింది.