Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: ఉపాధి హామీ పథకం బిల్లుకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కోన శశిధర్, వివేక్ యాదవ్ నేడు హైకోర్టులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. ఏడాది క్రితం బిల్లుల చెల్లింపు ఆదేశాలను పట్టించుకోలేదంటూ వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన విషయం తెలిసిందే. నేటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ హైకోర్టు ధర్మాసనం ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందని వెల్లడించింది. అంతే కాకుండా ఇవాళ విచారణ ఉందని తెలిసి, బిల్లుల చెల్లింపులను రెండ్రోజుల కిందట ఖాతాలో వేశారని హైకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.