Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అంశాలపై చర్చిస్తామన్నారు. నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.