Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ: కేరళ రాష్ట్రంలో ఓ మోడల్ పై కదిలే కారులో ముగ్గురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన సంచలనం రేపింది. కొడంగల్లూరుకు ముగ్గురు యువకులు, ఓ మహిళ కాసర్‌గోడ్‌కు చెందిన మోడల్ అయిన ఓ బాలికను డీజే పార్టీకి ఆహ్వానించారు. బార్‌లో మద్యం తాగి వచ్చిన మోడల్ అయిన బాలికను నిందితులు తమ వాహనంలో తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి ఘటనలో గాయపడిన మోడల్ ను వదిలి పరారయ్యారు. ఆసుపత్రిలో చేరిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ అత్యాచారానికి సహకరించిన ఓ మహిళతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని కేరళ పోలీసులు చెప్పారు.