Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును పరీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్‌కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ తన కుమార్తెను బయటకు తీసుకురావడం ఇదే మొదటిసారి. కిమ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఓ వేడుకలో కిమ్ తన పిల్లలో కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెల 3న ఏకంగా ఖండాతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా… తాజాగా శుక్రవారం మరోసారి ఐసీబీఎంని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా అనుమాస్పద ఖండాంతర క్షిపణిని పరీక్షించిందని సియోల్ సైన్యం వెల్లడించింది. ఇది ప్యాంగాంగ్ రూపొందించిన దీర్ఘ శ్రేణి ఆయుధమని, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలుగుతుందని చెప్పింది. దీనితో అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగంతో ఉత్తర కొరియా ఈ ఏడాది ఎనిమిది ఐసీబీఎంలను పరీక్షించినట్లయింది.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షతో జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి చెందిన హొక్సైడో రీజియన్‌లోని ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సముద్ర జలాల్లో క్షిపణి పడిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చెప్పారు. ఉత్తర కొరియా చర్య ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్నారు.