Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‍కు మరో షాకింగ్ న్యూస్. మరో సీనియర్ నేత హస్తాన్ని వదిలి కాషాయ గూటికి చేరడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వివిధ బీజేపీ అధిష్టాన నేతలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ కండువా కప్పుకుంటున్నారని చక్కర్లు కొట్టాయి. కాని వాటిని తీవ్రంగా ఖండించారు. కట్ చేస్తే.. గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు మర్రి. దీంతో.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. డీకే అరుణతో కలిసి వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డి.. అమిత్ షాతో భేటీ కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ కండువా కప్పుకోవటమే తరువాయి అని సన్నిహిత వర్గాలంటున్నారు. నేడో రేపో ఆయన మీడియా ముందుకు వచ్చి.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని.. అదే రోజు సాయంత్రం ఆయన జేపీ నడ్డా సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నట్లు చక్కర్లు కొట్టాయి. కానీ.. ఈ వార్తలను ఖండించిన మర్రిశశిధర్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఢిల్లీకి వెళ్లటం కొత్తమే కాదని.. ఈసారి మాత్రం తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు. అయితే.. ఆయన క్లారిటీ ఇచ్చిన రెండు రోజుల్లోనే మళ్లీ అమిత్ షాతో భేటీ అవ్వటం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న డీకే అరుణ.. బండి సంజయ్ మర్రి శశిధర్ రెడ్డిని అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి ఇరు నేతలు చర్చించారు. హైదరాబాద్ వెళ్లి కార్యాకర్తలతో మాట్లాడి.. మర్రి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అమిత్ షా భేటీ సందర్భంగా బీజేపీ నేతలు ఎంపీ అరవింద్ నివాసంపై దాడి గురించి చెప్పారు. దీంతో అమిత్ షా.. వెంటనే ఫోన్లో అరవింద్‌తో మాట్లాడారు.
ఇక కొన్ని నెలల క్రితం మునుగోడు మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారటం.. తర్వాత ఉప ఎన్నికలు రావడం జరిగాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్, మర్రి శశిధర్, ఇలా వరుసగా కీలక నేతలు పార్టీలు మారుతుండడం.. కలవరపెడుతోంది. ఓవైపు జోడోతో జోష్‌లో ఉన్నామనుకుంటున్నా సమయంలో.. ఈ చేరికలు కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి.