Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొమురం భీం: జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం వేంపల్లి - అనుకోడ గ్రామ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఖానాపూర్, కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుంది. పాద ముద్రలు, కెమెరాల ద్వారా అటవీశాఖ అధికారులు పులి కదలికలను గమనిస్తున్నారు. పులి కోసం 12 బృందాలచే గాలింపు చర్యలు చేపట్టారు. పులి కదలికలను పర్యవేక్షిస్తున్న జిల్లా అటవీశాఖ అధికారి దినేష్ కుమార్... పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.