Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్ర పరిధిలోని ముంబై – గోవా హైవేపై ఓ ఆడి కారులో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హైవేపై కారు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆడి కారును పరిశీలించారు. లోపల ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కారు డోర్‌ను పగులగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడిని పుణెలోని యశ్వంత్ నగర్‌కు చెందిన సంజయ్ కార్లేగా పోలీసులు గుర్తించారు. కార్లే శరీరంపై నాలుగు చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాయగఢ్ జిల్లాలోని పాన్వెల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.