Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిషబ్ పంత్ టీ20ల్లో ఓపెనర్‌గా రావాలని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంత్ షాట్లు బాగా ఆడుతాడని, సర్కిల్‌లో లోపు ఫీల్డర్లు ఉన్నప్పుడు, అతను మంచి హిట్టింగ్ చేయగలడని, ఓపెనర్‌గా వచ్చినప్పుడే అతని స్ట్రయిక్ రేట్ బాగుందని, బౌలర్లను వత్తిడికి లోను చేసే సత్తా పంత్‌కు ఉందని కార్తీక్ తెలిపాడు.
టెస్టు జట్టులో పంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని, వన్డేల్లో కూడా దాదాపు అతనే కీపర్‌గా ఉంటాడని, అయితే టీ20ల్లో మాత్రం వేర్వేరు పొజిషన్లలో పంత్ ఆడుతున్నాడని కార్తీక్ తెలిపాడు. ఐపీఎల్‌లో ఒక పొజిషన్‌లో, ఇండియన్ టీమ్‌కు మరో పొజిషన్‌లో అతను ఆడుతున్నట్లు కార్తీక్ చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కోహ్లీ, సూర్య, పాండ్యా ఉన్నప్పుడు.. మరి పంత్‌కు ఎక్కడ చోటు లభిస్తుందని అన్నాడు. పంత్‌ను అయిదో స్థానంలో ఆడిపించడం కంటే.. ఓపెనర్‌గా పంపడమే బెటర్ అని కార్తీక్ తెలిపాడు.