Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాకపోకలను బంద్ చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రేస్‌లు నెక్లెస్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్ మీదుగా ఐమాక్స్ వరకు కొనసాగుతాయి.