Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ముడి సరుకు నిల్వ ఉంచిన విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్వేయర్ బెల్టులు ఒకదానితో ఒకటి రాపిడికి గురవ్వడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు కోటిన్నర రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.