Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకొని హనుమకొండ జిల్లాలోకి వైయస్ షర్మిల అడుగుపెట్టింది. ఈ తరుణంలో ఉప్పల్ వద్ద వైయస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చాడని మండిపడ్డారు. కెసిఆర్ ని మళ్లీ నమ్మి ఓటు వేస్తే రాష్ట్రాన్ని కుక్కలు చంపిన విస్తరి చేస్తాడని విమర్శించారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల కుప్ప చేశారని అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని, వైయస్సార్ పథకాలు మళ్లీ అమలు కావాలన్నారు. ప్రపంచంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తామన్నారు.