Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరుణంలో ఎన్నికలు జరపగా గుజరాత్ క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు బీసీసీఐ కార్యదర్శి జై షా శుభాకాంక్షలు తెలియజేశారు. జీసీఏ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్న ధన్ రాజ్ నత్వానీ ఇప్పటివరకు జీసీఏ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. తాజా కార్యవర్గంలో జీసీఏ ఉపాధ్యక్షుడిగా హేమంత్ భాయ్ కాంట్రాక్టర్, కార్యదర్శిగా అనిల్ భాయ్ పటేల్, సంయుక్త కార్యదర్శిగా మయూర్ భాయ్ పటేల్, కోశాధికారిగా భరత్ జవేరీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే గుజరాత్ క్రికెట్ సంఘానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేయడం విశేషం. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2009లో జీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత 2014లో జీసీఏ అధ్యక్షుడిగా అమిత్ షా పదవిని చేపట్టారు. ఇప్పుడు అమిత్ షా స్థానంలో ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.