Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఖాతా పునరుద్ధరణపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో మాజీ అధ్యక్షుడి ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ట్రంప్ ఎకౌంట్ ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడారు.. ట్రప్ ఖాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్వీట్ చేశారు. ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ (వోక్స్ పాపులి, వోక్స్ డీ) అంటూ ల్యాటిన్ పదబంధాన్ని ఉపయోగించారు. డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. అందులో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా స్పంధించారు. దీంతో 22 నెలల నిషేధం తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సంస్థ పునరుద్ధరించింది.