Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం పర్యటించారు. ప్రధాని హోదాలో తొలిసారిగా కీవ్‌ను సందర్శించడం తనను కదిలించిందని చెప్పారు. రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. పౌరుల్ని, కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు భారీగా గగనతల రక్షణ వ్యవస్థలను అందజేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు. సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో పోరాడుతున్నవారిని కలవడం తననెంతో కదిలించిందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి రష్యా బలగాలను వెనక్కి పంపించడంలో ఉక్రెయిన్ విజయం సాధించినా గగనతలం నుంచి పౌరులపై దాడులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విమానాలపై విరుచుకుపడే ఆయుధాలను, రాడార్లను, డ్రోన్ల నిర్వీర్యక పరికరాలను, శీతాకాలంలో అవసరమయ్యే మానవతా సాయాన్ని అందించబోతున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో ఎనిమిది ప్రాజెక్టులకు చేయూతనందించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది.