Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు వారి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మృతులను సౌదీ వాసులుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఫ్యామిలీ వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాంతో ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత వారం కూడా ఓ వాహనం ఒంటేను ఢీకొట్టడంతో ఐదుగురు సౌదీ పౌరులతో పాటు ముగ్గురు యేమనీలు చనిపోయారు. కాగా, ట్రాఫిక్ నిబంధనలపై సరియైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తుండడంతోనే ఇటీవల రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయని సౌదీ ట్రాపిక్ విభాగం పేర్కొంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితులను పాటించడం తప్పనిసరి అని తెలిపారు. అలాగే ర్యాష్, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.