Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అనంత్‌నాగ్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ హైబ్రీడ్ టెర్రరిస్టు హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బేహార్ ప్రాంతంలో రహస్య స్థావరాలను గుర్తించడానికి భద్రత దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ హైబ్రిడ్ టెర్రరిస్ట్ చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మృతుడిని సజ్జాన్ తంత్రేగా గుర్తించారు. అతడు లష్కరే తొయిబా ఉగ్రవాది అని, నవంబర్ 13న బిబ్ బెహారాలోని రఖ్‌మోమెన్‌లో స్థానికేతర కూలీ హత్యకేసులో అతని ప్రమేయం ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.