Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: దిట్టకుడి సమీపంలో సెల్‌ఫోన్ ఆడుతూ వెళుతున్న మూడేళ్ల చిన్నారి పొరపాటున బావిలో పడి మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది. మంగళూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ -సంగీత దంపతులకు ఆరేళ్ల కుమారుడు, మూడేళ్ల రష్మిత ఉన్నారు. రష్మిత పొలం పనులు చేస్తున్న సమయంలో రష్మితకు సెల్‌ఫోన్ ఇచ్చినట్లు సమాచారం. సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూ నడుస్తున్న రష్మిత హఠాత్తుగా 20 అడుగుల లోతున్న నేలబావిలో పడింది. బావిలో చిన్నారి పడిన విషయం గమనించి చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని బావిలో గాలించగా రష్మిత మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.