Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌంట్ మాంగనుయి: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓడిన భారత్, న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్‌లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్ సిరీస్‌లో భాగంగా.. బే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కివీస్ కెప్టెన్ కేన్ విల్‌యంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణమవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే పాండ్యా సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్‌తో భారత్ బరిలోకి దిగుతున్నది.