Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని దుఃఖం నింపింది. నగల వ్యాపారి నవర నానాజీ, అతడి కుమారుడు మౌలేశ్ ఇంటిలో విద్యుత్ మరమ్మతులు పనిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మౌలేశ్ దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.