Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు,సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన పూజల్లో పాల్గొంటున్నారు.