Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆదివారం నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేస్ ట్రాక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ (ట్రాఫిక్) రంగనాథ్ తెలిపారు. సందర్శకులు అయోమయానికి గురికాకుండా ప్రతీ స్టాండ్‌కూ ప్రత్యేకంగా ఎంట్రీ గేట్లు, పార్కింగ్ ప్రదేశాలు కేటాయించామన్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి ఎంట్రీ గేటు వరకు చేర్చేందుకు షటిల్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. మెట్రో, ఆర్టీసీలో ప్రయాణించే సందర్శకులు తమకు కేటాయించిన స్టాండ్‌కు చేరేందుకు ఆయా ఎంట్రీ గేట్‌లను వినియోగించుకోవాలన్నారు. రేసింగ్ ట్రాక్ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదన్నారు.