Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సభా ఏర్పాట్లపై పార్టీ శ్రేణులు, అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు ఇదే గ్రౌండ్‌లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కలెక్టరేట్ కోసం హైవే పక్కనే స్థలం లభించడం అదృష్టమని, ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉండనున్నారని తెలిపారు.