Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవడం పట్ల పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరయ్యారు. ఈ తరుణంలో 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు హజరు కాలేదు.