Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి నరసాపూర్‌లో శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో చిరంజీవిని స్నేహితులు, కాలేజీ యాజమాన్యం సత్కరించారు. ఈ తరుణంలో చిరంజీవి మాట్లాడుతూ నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానన్నాడు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కటువుగా, మొరటుగా ఉండాలి. సున్నితంగా ఉండకూడదు. మాటలు అన్నా అనకపోయినా అనాలి అనిపించుకోవాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా..? అని అనిపించిందన్నాడు. పవన్ కల్యాణ్ పేరు వినగానే రాజకీయాలకు పవన్ కల్యాణ్ తగినవాడు. పవన్ కల్యాణ్ మాటలు అంటాడు పడతాడు. పవన్ కల్యాణ్‌కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో మనం ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్‌ను అత్యున్నత స్థానంలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.