Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదుగా పూజారా శనివారం అర్జున అవార్డు అందుకున్నాడు. 2017 లో పూజారాకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. అయితే, ఆ ఏడాది అతను అవార్డు వేడుకకు హాజరు కాలేదు. దీంతో ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్న పూజారా ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆలస్యం అయినా కూడా నాకు సన్మానం చేసి, అర్జున అవార్డు ప్రదానం చేసినందుకు బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్‌కి ధన్యవాదాలు. తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆ ఏడాది అవార్డు అందుకోలేకపోయాను. అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది అంటూ పూజారా ట్వీట్ చేశాడు.