Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శనివారం అట్టహాసంగా ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ నిలిపివేశారు. చీకటి పడటంతో ఆదివారం కార్ల రేసింగ్‌ను నిర్వాహకులు ముందుగానే నిలిపివేశారు. అయితే ట్రాక్‌కు రెండు రోజులు మాత్రమే అనుమతి ఉండడంతో రేపు (సోమవారం) నిర్వహణకు అవకాశంలేదనే చెప్పాలి. దీంతో జూనియర్ ఛాంపియన్‌షిప్‌తోనే సరిపెట్టినట్టయ్యింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అంటూ ఎదురుచూసిన కొందరు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదుదైంది. వీఐపీ టికెట్ తీసుకున్నా పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పెట్టి టికెట్లు కొంటే లోపలికి పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ గ్యాలరీలో టికెట్ తీసుకున్న వారు కాకుండా ఇతర వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులతో గ్యాలరీ నిండిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా లోపలికి అనుమతించడంలేదని పోలీసులు చెప్పారు. దీంతో పలువురు అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.