Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా: గతంలో ఓర్లాండోలోని స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొలరాడోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. కొలరాడో స్ప్రింగ్స్ శివారులోని క్లబ్ క్యూ లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ లెఫ్టినెంట్ పమేలా కాస్ట్రో మీడియాకు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని చుట్టుముట్టారని, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ నైట్‌క్లబ్‌ను ప్రత్యేకంగా స్వలింగ సంపర్కుల కోసం నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. తాజా ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇది తమ సమాజంపై జరిగిన ద్వేషపూరిత దాడిగా పేర్కొంది.