Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ వాటర్ ఫాల్స్ లోకి ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు సంబంధించిన వారు. ఒకరు మరి నాగరాజు (45), ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. వృత్తి రిత్యా ఇస్తిరి షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మరొకరు మైలారం రాజు (32 ) ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కార్మికులు ఒకేసారి మృతిచెందడంతో ఆ గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం వారి కుటుంబాలకు చేయుతనిచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.