Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలు ఒక్కసారి కాదు వందసార్లయినా మొక్కుతానని, సీఎం తనకు తండ్రి సమానులని ఆయన పాదాలను తాకడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి- కొత్తగూడెం ప్రాంతానికి కేసీఆర్ కొత్త వైద్యశాలను కేటాయించారని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ మరో బాపూజీ అని, ఇక్కడ కాలేజీలు లేకపోవడం వల్ల 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేయడానికి తాను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను గత మంగళవారం ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ కాలేజీలన్నింటిలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ అధికార యంత్రాంగం స్వామి భక్తిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మంది కలెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు సీఎం కెసిఆర్ కాళ్లు మొక్కి అనేకమార్లు తీవ్ర విమర్శలకు కారణమయ్యారు. ఇక తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఘటన ఆసక్తిగా మారింది.