Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: పోసాని కృష్ణమురళికి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదవ్వడం విశేషం. పోసాని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను, జనసేన నేతలను, వీర మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు బుక్ చేశారు. పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్లు మోపారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయింగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు జనసేన నేతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పోసానిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.