Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: స్థాయీ సంఘం చైర్మన్, ఎథిక్స్ కమిటీ, ప్యానల్ చైర్మన్ పదవుల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తప్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్‌కు లేఖ రాశారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఆయన సోషల్ మీడియాలో నీచమైన భాష వాడుతున్నారని, దిగజారిన భాషతో పెద్దల సభ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై అనుచిత భాషతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు, అసహ్యకరమైన పోస్టులు కనిపిస్తాయన్నారు. పార్లమెంటు గౌరవాన్ని కాపాడడంలో మీ పాత్ర కీలకమని, కాబట్టి ఇలాంటి అనుచిత భాష ఉపయోగిస్తున్న విజయసాయిరెడ్డిని స్థాయీ సంఘం చైర్మన్ పదవితోపాటు ఎథిక్స్ కమిటీ నుంచి తప్పించాలని కోరుతున్నట్టు రఘురామరాజు ఆ లేఖలో తెలిపారు.