Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లి: పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కనిపించిన రెండు డ్రోన్లు కాసేపు కలకలం సృష్టించాయి. భారత జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించి కాల్పులు జరపడంతో పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. తొలి డ్రోన్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు దానిపై కాల్పులు ప్రారంభించడంతో తోకముడిచి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. ఆ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ దాదాపు 96 రౌండ్ల కాల్పులు జరిపింది. అలాగే, 5 ఇల్యుమినేషన్ బాంబులను ప్రయోగించింది. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో తనిఖీలు జరిపింది. దీంతోపాటు అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో అది వెనక్కి వెళ్లిపోయింది.