Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన ఆజ్ తక్ (ఇండియా టుడే) సంస్థ వారి సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిసాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా సాహిత్యం ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాముు అని వ్యాఖ్యానించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ ఇండియూ టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు. ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతలో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని, యువతకు సాహిత్యం అర్థంకాదని భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటారని, కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని స్పష్టం చేశారు. శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందని తెలిపారు.