Nearly 48 cars crashed on Pune- Bengaluru highway near navale bridge. #Pune #ACCIDENT pic.twitter.com/NSlIcanbXz
— Alekh Shirke (@AlekhShirke) November 20, 2022
Authorization
Nearly 48 cars crashed on Pune- Bengaluru highway near navale bridge. #Pune #ACCIDENT pic.twitter.com/NSlIcanbXz
— Alekh Shirke (@AlekhShirke) November 20, 2022
పూణె: పూణెలోని నవాలే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఘటనలో ఏకంగా 48 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 38 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంతో పూణె-బెంగళూరు రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనికంతటికీ ఓ ఆయిల్ ట్యాంకర్ కారణమైంది. వేగంగా వచ్చిన ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో ట్యాంకర్ లోని ఆయిల్ లీకై రోడ్డు మీద పడింది. దాని కారణంగా మరిన్ని వాహనాలు రోడ్డుపై పట్టు కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకే చోట పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అవ్వగా 30 మందికి గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పూణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చాలా కార్లు వాటి ముందున్న కంటైనర్ల కిందకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్లు అయ్యాయి. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా తెలిసింది.